తెలంగాణాలో కరోనావైరస్ వ్యాపించకుండ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, విదేశాలనుండి వస్తున్న వ్యక్తుల ద్వారా ఈ మహమ్మారి ప్రబలుతుంది. కొత్తగా ఏడుగురికి COVID-19 పాజిటివ్ గా తేలడం తో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. మార్చ్ 14 న ఇండోనేషియా దేశం నుండి 10 మంది వ్యక్తులు వచ్చారు. మార్చ్ 16 న ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చింది, దాంతో అతన్నిఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితె తాజాగా ఆ బృందంలోని మరో ఏడుగురికి కూడా కొరోనా వైరస్ సోకినట్టు తెలిసింది.
ఇండోనేషియా నుండి వచ్చిన ఈ వ్యక్తులు కరీంనగర్ లో మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. వీరంతా ఢిల్లీ కి ఏరోప్లేన్స్లో వచ్చి అక్కడినుండి హైదరాబాద్ కి ట్రైన్ లో వచ్చినట్టు తెలుస్తుంది.
ఈ కొత్త కరోనా కేసుల వలన తెలంగాణాలో మొత్తం పాజిటివ్ కేసులు ఇప్పటివరకు 13 కి చేరింది.
ఆశ్చర్య పరిచే విషయం ఏమిటంటే ప్రంపంచం అంతా వైరస్ భయంతో వణికిపోతుంటే, ఈ ఇండోనేషియా బృందం కేవలం మతపరమైన కార్యక్రమం కోసం భారతదేశానికి ఎందుకు వచ్చిందో?

0 Comments