విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లో 2019 జనవరిలో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియాను ఓడించిన తొలి ఆసియా జట్టుగా భారత్ నిలిచింది. భారత పేస్ బౌలింగ్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీలు చెలరేగి బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా గడ్డపై భారతదేశ చారిత్రాత్మక సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఆ సిరీస్ లో పాలొన్న ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్కస్ హారిస్, పెర్త్ టెస్ట్ సందర్భంగా భారతీయ పేస్ త్రయాన్ని ఎదుర్కోవడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పెర్త్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మార్కస్ హారిస్ హెల్మెట్‌పై బంతి తగలగా, మరొక క్రికెటర్ ఆరోన్ ఫించ్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.
మార్కస్ హారిస్ మాట్లాడుతూ నేను భయపడ్డాను ఆ వికెట్ (పెర్త్) పై ఆ దాడిని (భారత ఫాస్ట్ బౌలర్లు) ఎదుర్కోవడం భయానకంగా ఉంది. ఇది టివిలో బాగా కనబడి ఉండవచ్చు, కానీ మధ్యలో అది భయానకంగా ఉంది అని హారిస్ డాక్యుమెంటరి సిరీస్ ది టెస్ట్ లో అన్నారు.
అడిలైడ్ మరియు మెల్బోర్న్లలో మొదటి మరియు మూడవ టెస్టులలో భారత్ గెలిచింది, పెర్త్లో జరిగిన రెండవ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఐదవ రోజు ఆట మానేసిన తరువాత నాల్గవ టెస్ట్ డ్రాగా ముగిసింది.

0 Comments