కరోనావైరస్ పై పోరాటం టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లాంటిది : సచిన్ టెండూల్కర్

ప్రపంచంలోని అన్ని దేశాలను కుదిపివేస్తున్న కరోనావైరస్ పైన పోరాటం ఒక టెస్ట్ మ్యాచ్ లాంటిది అని భారత మాస్టర్ బ్లాస్టర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. ఎలాగైతే టెస్ట్ మ్యాచ్లో ఎంతో సహనంతో బాటింగ్ చేస్తామో అలాగే కరోనా విపత్తును కూడా సహనం తో పాటు నిబద్దత, అప్రమత్తతతో ఎదురుకోవాలని సచిన్ కోరారు. 
fight-against-coronavirus-is-like-a-test-match-sachin-tendulkar
ప్రపంచం అంతా కరోనావైరస్ తో పోరాటం చేస్తున్న వేళ ఒకసారి టెస్ట్ క్రికెట్ ను గుర్తు తెచ్చుకోవాలి. టెస్ట్ మ్యాచ్ల్లో సహనం మరియు అప్రమత్తతో ఎంతో సేపు బాటింగ్ చెయ్యాల్సి ఉంటుంది. పిచ్ పరిస్థితులు మరియు బౌలింగ్ శైలిని బట్టి సహనంతో, నిబద్దతతో క్రీజ్లో బాటింగ్ చెయ్యాలి. అదే విదంగా ఇప్పుడు కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి ఓర్పు, సహనం అవసరమని సచిన్ టెండూల్కర్ క్రికెటింగ్ పరిభాషలో ప్రజలుకు విగ్యప్తి చేశారు. 

ఏదైనా సంభావ్యత కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవడంలో #JantaCurfew సరైన దశ అని గౌరవ PM@narendramodi COVID-19 కి వ్యతిరేకంగా పోరాటాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలని సరిగ్గా చెప్పారు. మనల్ని మరియు ఇతరులను రక్షించుకోవడానికి ఇంట్లోనే ఉండండి అని సచిన్ టెండూల్కర్ ఇంతక ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూని సమర్థిస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. 

Post a Comment

0 Comments