కరోనావైరస్ సంక్షోభం కారణంగా జర్మనీ లోని రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆత్మహత్య

thomas-schafer-german-state-finace-minister-suicide.PNG (494×260)
ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరంతో తో సహా జర్మనీలోని హెస్సీ ప్రాంత రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షాఫెర్ చనిపోయినట్లు గుర్తించారు. అతను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అని అధికారులు తెలిపారు. ఆయన కరోనావైరస్ సంక్షోభంతో నిరాశలో ఉన్నట్లు రాష్ట్ర గవర్నర్ విలేకరులకు తెలిపారు. 

జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ యొక్క క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ సభ్యుడు థామస్ షాఫెర్ మృతదేహం ఫ్రాంక్‌ఫర్ట్ సమీపంలోని హోచ్‌హీమ్ వద్ద రైల్వే ట్రాక్‌లపై శనివారం కనుగొనబడింది.

పోలీసులు మరియు ప్రాసిక్యూటర్లు సాక్షులను ప్రశ్నించడం మరియు సంఘటన స్థలం పరిశీలించడంతో  షాఫెర్ ఆత్మహత్య చేసుకున్నట్టు కనుగొన్నారు. 

కరోనావైరస్ సంక్షోభం వల్లనే షాఫెర్ చనిపోయారని రాష్ట్ర గవర్నర్ వోల్కర్ బౌఫియర్ అన్నారు. లొక్డౌన్ నేపథ్యంలో "జనాభా యొక్క భారీ అంచనాలను, ముఖ్యంగా ఆర్థిక సహాయం నెరవేర్చడంలో విజయం సాధించగలనా. " అని థామస్ షాఫెర్ చింతించినట్టు ఆయన తెలిపారు. 

Post a Comment

0 Comments