ఇండిగో ఎయిర్లైన్స్ సీఈఓ తోపాటు ఉద్యోగుల జీతంలో కోత విదించనున్న కంపెనీ

ఇండిగో సీఈఓ రోనోజోయ్ దత్తా గురువారం ఎయిర్లైన్స్ సీనియర్ ఉద్యోగులకు వేతనంలో కోతలను విధిస్తున్నట్టు ప్రకటించారు. కరోనావైరస్ మహమ్మారి వలనవిమానయాన పరిశ్రమ తీవ్రంగా దెబ్బతినడం వలన తాను 25 శాతం అత్యధిక కోత తీసుకుంటానని ప్రకటించారు.
indigo+fueselage.jpg (800×420)

"ఆదాయాలు వేగంగా పడిపోవడంతో, విమానయాన పరిశ్రమ మనుగడ ఇప్పుడు ప్రమాదంలో ఉంది" అని దత్తా తన ఇమెయిల్‌లో ఉద్యోగులకు తెలిపారు. "మేము నగదు అయిపోకుండా ఉండటానికి మా నగదు ప్రవాహంపై జాగ్రత్తగా శ్రద్ధ వహించాల్సిఉంటుంది."

"చాలా అయిష్టతతో మరియు తీవ్ర విచారం వ్యక్తం చేస్తు, 2020 ఏప్రిల్ 1 నుండి బ్యాండ్ ఎ మరియు బి లను మినహాయించి ఉద్యోగులందరికీ వేతన కోతలు ఉంటాయని" అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పారు.

"నేను వ్యక్తిగతంగా 25 శాతం వేతన కోత తీసుకుంటున్నాను, సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ మరియు అంతకంటే ఎక్కువ స్థాయి ఉద్యోగులు 20 శాతం కోత తీసుకుంటున్నారు, విపిలు (వైస్ ప్రెసిడెంట్స్) మరియు కాక్పిట్ సిబ్బంది 15 శాతం వేతన కోత తీసుకుంటున్నారు, ఎవిపిలు (అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్స్), క్యాబిన్ సిబ్బందితో పాటు బ్యాండ్ డి 10 శాతం, బ్యాండ్ సి ఐదు శాతం ఉంటుంది. 

బ్యాండ్ ఎ మరియు బి జీతం తరగతిలో అతి తక్కువ బ్రాకెట్లు, ఇండిగోలో ఎక్కువ మంది ఈ కేటగిరి ఉద్యోగులు ఉన్నారు.

Post a Comment

0 Comments