కరోనావైరస్ అనుమానంతో క్వారంటైన్లోకి వెళ్లిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు

pm+pupa.jpg (720×405)
కరోనావైరస్ బెడద దేశాధ్యక్షులు, ప్రధాన మంత్రులను కూడా వదిలి పెట్టట్లేదు.  మొన్నఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జూన్సన్ కు కరోనా రాగా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కరోనావైరస్ సోకిందేమో అనే అనుమానంతో క్వారంటైన్ లోకి వెళ్లారు. 

ఇజ్రాయెల్ పిఎమ్ నెతన్యాహు దగ్గర పని చేసే ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా తేలడంతో, ప్రధానమంత్రి మరియు ఇతర సిబ్బంది ఇప్పుడు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. గత వారం బెంజమిన్ నెతన్యాహుతో పాటు ప్రతిపక్ష శాసనసభ్యులు పాల్గొన్న పార్లమెంటు సమావేశంలో ఆ సహాయకుడు ఉన్నట్లు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.

అన్ని టెస్టులు చేసి ఫలితాలు వెలువడే వరకు ఆయన మరియు ఆయన సిబ్బంది అందరూ క్వారంటైన్ లో ఉండాలి అని ప్రధానమంత్రి నిర్ణయించారని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. 

అధికారిక లెక్కల ప్రకారం నేటి వరకు ఇజ్రాయెల్ లో పాజిటివ్ కరోనా కేసులు 4347 కు చేరింది, 15 మంది మరణించారు. 

Post a Comment

0 Comments