ఏప్రిల్ 1 నుండి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల విలీనం, UBI గా మారనున్న ఆంధ్రాబ్యాంక్


COVID-19 మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పటికి,  ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) కొనసాగిస్తుంది. 

గతేడాది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 10 ప్రభుత్వ బ్యాంకులను నాలుగుగా విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రణాళిక ప్రకారం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి)  ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మరియు యునైటెడ్ బ్యాంక్‌ను విలీనం చేసుకుంటుంది, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) తరువాత భారతదేశంలో రెండవ అతిపెద్ద బ్యాంకు అవుతుంది.

అదేవిధంగా, సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంకులో విలీనం అవుతుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్ర బ్యాంక్ మరియు కార్పొరేషన్ బ్యాంక్ రెండింటినీ విలీనం చేసుకుంటుంది. ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ కూడా విలీనం కానున్నాయి.

మార్చి 28 న విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో, ఈ విలీనాలన్నీ ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయని ఆర్బిఐ తెలిపింది. 

  • అలహాబాద్ బ్యాంక్ శాఖలు ఏప్రిల్ 1 నుండి ఇండియన్ బ్యాంక్ శాఖలుగా పనిచేస్తాయని, 
  • ఆంధ్ర బ్యాంక్ మరియు కార్పొరేషన్ బ్యాంక్ శాఖలు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా శాఖలుగా పనిచేస్తాయని చెప్పారు. 
  • ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మరియు యునైటెడ్ బ్యాంక్ శాఖలు పిఎన్‌బి శాఖలుగా పనిచేస్తాయి. 
  • సిండికేట్ బ్యాంక్ ఏప్రిల్ 1 నుండి కెనరా బ్యాంక్ శాఖలుగా పనిచేస్తాయి. 

Post a Comment

0 Comments