పుల్షాట్ పై ఐసీసీ కి చురకలు అంటించిన ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ

క్రికెట్లో ఉత్తమ పుల్ షాట్‌ కొట్టగల బ్యాట్స్‌మన్‌ ఎవరు అంటూ ఐసిసి తన అభిమానులను ట్విట్టర్ లో కోరింది. ఆ ట్వీట్ తోపాటు నలుగురు క్రికెటర్లు సర్ వివియన్ రిచర్డ్స్, రికీ పాంటింగ్ మరియు హెర్షెల్ గిబ్స్ తో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్న ఫోటోని షేర్ చేసింది. అయితే పుల్ షాట్ బాగా ఆడగలిగే రోహిత్ శర్మకు ఐసీసీ ట్వీట్లో తన ఫోటో లేకపోవడం నచ్చలేదు. ఈ విషయాన్నీ రోహిత్ శర్మ ఇండైరెక్టుగా ఐసీసీ ట్వీట్ కి రిప్లై ద్వారా తెలిపాడు. 
rohit-sharma-takes-dig-at-icc-best-pullshot-batsman-tweet.PNG (430×494)
"ఇక్కడ ఎవరో మిస్ అయ్యారు  ??  ఇంటి నుండి పని చేయడం అంత సులభం కాదు అని నేను అనుకుంటున్నాను" అంటూ ఐసీసీ ట్వీట్ కి రిప్లై ఇచ్చాడు. 

ఇప్పుడు ఈ ట్వీట్ విస్తృతంగా సోషల్ మీడియాలో షేర్ అవుతోంది మరియు క్రికెట్ అభిమానులు అనేక ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా, ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ పుల్లర్లలో రోహిత్ శర్మ కూడా ఉన్నారని వారిలో చాలామంది అభిప్రాయపడ్డారు. ఐసిసి పోస్ట్ చేసిన ట్వీట్‌కు రోహిత్ శర్మ ఫోటోలతో పలువురు యూజర్లు రిప్లై ఇచ్చారు. 

భారత దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ పోస్ట్‌ను షేర్ చేసి రోహిత్ శర్మ మరియు రికీ పాంటింగ్‌ను ట్యాగ్ చేయగా, కెవిన్ పీటర్సన్ మాజీ దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆండ్రూ హడ్సన్‌గా పేరును టాగ్ చేసాడు.

Post a Comment

0 Comments