మీ రిఫ్రిజిరేటర్‌ను శుభ్రపరచడం మీ ప్రాధాన్యత జాబితాలో ఎప్పుడూ కనిపించదు. చాలా మంది ఫ్రిడ్జిలోనుండి బహుశా దుర్గంధం వచ్చేవరకు దానిని శుభ్రం చెయ్యాలని ఆలోచించరు. రకరకాల వ్యాధులు వ్యాపిస్తున్న ఈ తరుణంలో శుభ్రత అనేది చాలా ముఖ్యం, అందులోనూ మనం తినే ఆహార పదార్ధాలు ఉండే ఫ్రిడ్జ్ యొక్క శుభ్రతను అస్సలు విస్మరించకూడదు.
మీ రిఫ్రిజిరేటర్‌ను శుభ్రపరచడానికి కొన్ని సులభతరమైన చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
మీ రిఫ్రిజిరేటర్‌ను శుభ్రపరచడానికి కొన్ని సులభతరమైన చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
- కఠినమైన మరకలను తొలగించడానికి టూత్‌పేస్ట్ ఉపయోగించండి. ఇది సున్నితమైన రాపిడి కలిగి ఉంటుంది మరియు ఆహ్లాదకరమైన వాసన కలిగి ఉంటుంది.
- మీ ఇంట్లో తయారు చేసిన ఆల్-పర్పస్ క్లీనర్‌ను ఫ్రిడ్జ్ క్లీన్ చెయ్యడానికి ఉపయోగించండి. ½- కప్ వెనిగర్ మరియు ¼- కప్ బేకింగ్ సోడా. స్ప్రే బాటిల్ లోకి పోయాలి, లేదా ఒక గిన్నె నుండి స్పాంజిలో ముంచి ఫ్రిడ్జిని శుభ్రం చెయ్యండి.
- చేదు వాసనలు రాకుండా నిర్మూలించడానికి , కొన్ని పత్తి బంతుల్లో వనిల్లా ఫ్లేవర్ చల్లి,ఒక చిన్న డిష్‌లో ఉంచి రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. ఆరెంజ్ ఫ్లేవర్ కూడా పనిచేస్తుంది.
- మీకు ఎక్కువ సమయం లేకపోయినట్లు అయితే ఒక శుభ్రమైన తడి బట్ట తీసుకొని అన్ని చోట్ల తుడవండి.
0 Comments