యూట్యూబ్ వీడియో క్వాలిటీ తగ్గించిన కంపెనీ

YTLogo_old_new_1680.gif (1600×1000)
భారతదేశంలో యూట్యూబ్ తన మొబైల్ యాప్  వీడియో నాణ్యతను 480p  లేదా SD (స్టాండర్డ్ డెఫినిషన్) కు పరిమితం చేసింది. అంటే యూట్యూబ్‌లోని ఏ వీడియోకైనా అత్యధిక స్ట్రీమింగ్ క్వాలిటీ డిఫాల్ట్‌గా 480p ఉంటుంది. 

ఇంటర్నెట్ బ్రౌసర్ లో YouTube వీడియోస్ క్వాలిటీ లో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. 

గూగుల్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు హాట్‌స్టార్ వంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ సంస్థలు భారతదేశంలో 21 రోజుల లాక్‌డౌన్ కాలంలో వీడియో స్ట్రీమింగ్ నాణ్యతను 480p కి పరిమితం చేయాలని నిర్ణయించిన కొద్దిసేపటికే యూట్యూబ్ ఈ మార్పు చేసింది. ఇంటర్నెట్ ట్రాఫిక్ పై భారాన్ని తగ్గించడంలో కంపెనీలు తీసుకున్న చర్య ఇది. EU దేశాల్లో కూడా యూట్యూబ్ తన వీడియో క్వాలిటీని తగ్గించింది. ఒరిజినల్ క్వాలిటీ కంటే కొంచెం తక్కువ క్లారిటీతో netflix తన వీడియోస్ అందిస్తుంది. 

40 కోట్ల స్మార్ట్ ఫోన్స్ ఉన్న భారతదేశంలో 21 రోజుల లొక్డౌన్ ప్రకటించినప్పటి నుండి ఇంటర్నెట్ వాడకం చాలా రెట్లు పెరిగింది.  ఫేస్బుక్ కూడా వాడకం తీవ్రంగా పెరగడంతో తన వీడియోస్ క్వాలిటీ ని తగ్గించింది. 

Post a Comment

0 Comments