అసలు ఎలా మొదలయిందో తెలియదు కానీ మంగళవారం, మహేష్ బాబు మరియు తలపతి విజయ్ అభిమానులు మాటల యుద్ధానికి దిగారు, తమ వ్యతిరేక హీరోతో పాటు, అతని ఫాన్స్ ని కూడా తిట్టుకున్నారు. #RemakeStarVijay మరియు #DummyStarMahesh అంటూ వెటకారంగా హ్యాష్ట్యాగ్ లు పెట్టి మరి సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తూ దుమ్మెత్తిపోసుకున్నారు. కొంచంసేపు తరువాత ప్రభాస్, అల్లు అర్జున్ మరియు మరికొంతమంది తారల అభిమానులు కూడా తాము ఏమి తక్కువ తినలేదు అంటూ టాలీవుడ్, కోలీవుడ్ హీరో ఫాన్స్ ఫైట్లోకి ఎంటర్ అయ్యారు. అయితే కొంచెంసేపు తరువాత ఈ ఫైట్ చల్లబడింది.
ఇలాంటి సమయంలో మహేష్ బాబు, తలపతి విజయ్ ఫాన్స్ ఫైటింగ్ చేసుకోవడం చాలా మందికి విచిత్రంగా అనిపించింది, ఇది కరోనావైరస్ ప్రభావమేమో అంటూ కొందరు ఆలోచనలో పడ్డారు.
0 Comments