భారతదేశ వ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తిని నిరోదించడానికి లాక్ డౌన్ ప్రకటించడంతో రవాణా సేవలు నిలిచిపోయాయి, దింతో ప్రజలు ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. ట్రైన్లు, బస్సులు, టాక్సీలు, ప్రైవేట్ వాహనాలు ఒక ఊరినుండి ఇంకొక ఊరికి వెళ్లకుండా నిలిపివేశారు. అయితే ఇప్పుడు ఇండియన్ రైల్వేస్, విమాన సర్వీసులను ఏప్రిల్ 15వ తేదీ నుండి తిరిగి ప్రారంభించనున్నారు. ట్రైన్లకు, విమానాలకు ఏప్రిల్ 15 నుండి బుకింగ్లు కూడా మొదలుపెట్టారు.
లాక్ డౌన్ పొడిగించే అవకాశంలేదు అని ఇటీవల కేంద్ర కాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ప్రకటించిన నేపథ్యంల, ఏప్రిల్ 15 ను నుండి ప్రయాణాలకు మార్గం సుగమం అయినట్లే. గురువారం నుండి ట్రైన్ల బుకింగ్ కొరకు IRCTC వెబ్సైటు కానీ యాప్ లో కానీ టిక్కెట్లు 15వ తారీఖు నుండి ప్రయాణాలు చేయాలనుకునే వారు టిక్కెట్లు కొనుక్కోవచ్చు. విమాన సంస్థలు కూడా టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని తిరిగి ప్రారంబించాయి. అయితే ప్రస్తుతానికి ఎయిర్లైన్స్ సంస్థలకు విదేశీ ప్రయాణాలకు అనుమతి లభించే అవకాశం లేదు.
అయితే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో బస్సు సేవలు ప్రారంభించే విషయం పై ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం ప్రకటించలేదు. హైదరాబాద్ లోని మెట్రో ట్రైన్ విషయంలో కూడా ఇంకా ప్రభుత్వం ఎటువంటి సమాచారం విడుదల చెయ్యలేదు. కరోనావైరస్ మనుషుల శరీరంలో నిస్తేజంగా ఉంటూ ఒకరి నుండి ఒకరి పాకే అవకాశం ఉండడంతో కొన్ని రోజుల వరకు ప్రజలు అత్యంత అవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.
0 Comments